Monday, August 28, 2023

ఆయుష్మాన్ భారత్ దరఖాస్తు, ఇ-కార్డు ప్రక్రియ

 పీఎంజేఏవైకి అర్హులు అని నిర్ధరణ అయిన తర్వాత ఈ-కార్డుకు ప్రయత్నించవచ్చు. కార్డు జారీ చేసే ముందు పీఎంజేఏవై దగ్గర మీ ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు పరిశీలిస్తారు.

కుటుంబసభ్యుల గుర్తింపు నిర్ధరణ పత్రాలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సభ్యుల జాబితా పత్రాలు కూడా చూపాలి.

అలాగే పీఎం లెటర్, ఆర్‌ఎస్‌బీవై కార్డులు కూడా చూపాలి. వీటిని పరిశీలించిన తర్వాత ఈ-కార్డు ప్రింట్ ఇస్తారు.

ఆ కార్డును ప్రత్యేకంగా ఏబీ-పీఎంజేఏవై ఐడీతో ఇస్తారు. దీన్ని భవిష్యత్తులో ఏ సందర్భంలోనైనా ప్రూఫ్‌గా వాడవచ్చు.

ఈ పథకం కింద కుటుంబ సభ్యులందరినీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆడపిల్లలు, స్త్రీలు, వృద్ధులకు ముఖ్యంగా అరవై ఏళ్లు పైబడ్డవారికి ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఈ పథకం కింద అందించే ఖర్చులు

ఆసుపత్రిలో చేర్చినపుడు అయిన ఖర్చుతోపాటు వైద్యపరీక్షలు, చికిత్స, కన్సల్టేషన్, ప్రీ-హాస్పిటలైజేషన్, నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, మందులు, ఇతరత్రా ఖర్చులు అందిస్తారు.

డయాగ్నస్టిక్స్, లేబొరేటరీ సర్వీసులు, వసతి, అవసరమైన చోట మెడికల్ ఇంప్లాంట్ సేవలు, ఆహార సేవలు, చికిత్స సమయంలో తలెత్తే క్లిష్ట సమస్యలు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత 15 రోజుల పాటు వైద్య పరమైన ఖర్చులు కూడా చెల్లిస్తారు.

కోవిడ్-19 చికిత్సను కూడా ఈ పథకం కింద అందిస్తారు.

పీఎంజేఏవై పథకానికి కావలసిన ధృవపత్రాలు: గుర్తింపుకార్డు, వయసు ధృవపత్రం (ఆధార్ కార్డు/పాన్ కార్డు), మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, ఇంటి అడ్రస్, కుల ధృవపత్రం, ఆదాయ ధృవపత్రం, కుటుంబ స్థితిగతులను తెలిపే ధృవపత్రం.

పీఎంజేఏవై ఆసుపత్రుల జాబితా తెలుసుకోవాలంటే పీఎంజేఏవై అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో హాస్పిటల్ సెక్షన్లో మీ రాష్ట్రం, జిల్లాలపై క్లిక్ చేయాలి.

ఏ ఆస్పత్రిలో చేరాలనుకుంటున్నారో (ప్రభుత్వ, ప్రైవేట్-ఫర్-ప్రాఫిట్/ప్రైవేట్-అండ్ నాన్‌ ప్రాఫిట్) ఎంపిక చేసుకోవాలి. మెడికల్ స్పెషాలిటీని ఎంపిక చేసుకోవాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి.

PMJAY - Ayushman Bharat: ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు

 ఆర్థికంగా వెనకబడిన నిరుపేదవర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్రం అందిస్తున్న పథకం 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన'... పీఎంజేఏవై. ఈ పథకం కింద కేంద్రం ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది.

ఈ స్కీమ్ లబ్దిదారులను సామాజిక, ఆర్థిక, కుల జనగణన (సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్) ప్రాతిపదికగా తీసుకుంటారు.

పీఎంజేఏవై పథకాన్ని కేంద్రం 2018 సెప్టెంబర్ 23న ప్రకటించింది. ఈ ఆరోగ్య బీమా పథకం దేశంలోని 50 కోట్ల మంది లబ్దిదారులను ఉద్దేశించి ప్రారంభించారు.

పథకం కింద పది కోట్లకు పైగా ఈ-కార్డులు కూడా జారీ అయ్యాయి. జాతీయ ఆరోగ్య రక్షణ పథకంగా ఉన్న దీని పేరును ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనగా మార్చారు.

ఆర్థికంగా నిరుపేదలైన అర్హులైన లబ్దిదారులకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా దీని కింద సెకండరీ, టెర్షియరీ ఆరోగ్య సదుపాయాలను అందజేస్తారు.

ఈ పథకం ప్రకారం నిర్దేశిత జాబితాలోని ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందిస్తుంది. దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అయినా లబ్దిదారులు ఉచితంగా నాణ్యమైన ఆరోగ్యసేవలు పొందవచ్చు.

సేవలు ఎలా పొందాలి?

పీఎంజేఏవై పథకం కవరేజ్ కింద రోగిని మూడురోజుల ముందు ఆస్పత్రిలో చేర్చడంతోపాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా కేంద్రమే భరిస్తుంది.

ఈ పథకం కింద మొత్తం 1400 రకాల వైద్య ప్రొసీజర్ల సేవలు, ఆపరేషన్‌ థియేటర్‌ ఖర్చులు లాంటివి కూడా పొందవచ్చు. పేదలతోపాటు నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ పథకం కిందికి వస్తాయి.

అర్హులు ఎవరు?

10 కోట్ల కుటుంబాలకు పీఎంజేఏవై వర్తిస్తుంది. వీరిలో ఎనిమిది కోట్ల గ్రామీణ కుటుంబాలు, 2.33 కోట్ల పట్టణ ప్రాంత కుటుంబాలు ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనివారు, కేవల వేతనం మాత్రమే తీసుకునేవారు, ఇతరత్రా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు దీనికి అర్హులు.

పట్టణ ప్రాంతాల్లో చేసే వృత్తుల ఆధారంగా లబ్దిదారులను నిర్ణయిస్తారు. ఈ పథకం కింద కేంద్రం ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షలు అందజేస్తుంది.

రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్బీవై) కింద నమోదు చేయించుకున్న వాళ్లు పీఎం జన్ ఆరోగ్య యోజన పరిధి కిందకు వస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో..

గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, 16 నుంచి 59 ఏళ్ల వయసున్న మగవాళ్లు లేని కుటుంబాలకు, బిచ్చగాళ్లకు, వికలాంగులు ఉన్న కుటుంబాలు, ఏ పనీ చేయలేని వృద్ధులున్న కుటుంబాలకు, ఇల్లు లేని, రోజు కూలీకి వెళ్లేవారు, ఆదివాసీ సమాజాలు, చట్టబద్ధంగా స్వేచ్ఛ పొందిన కట్టుబానిసలు, సరైన ఇల్లు లేనివారు, లేక ఒక్క గదిలో జీవిస్తున్న కుటుంబాలు, పారిశుద్ధ్య పనుల్లో ఉన్న కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాలు పొందగలరు.

పట్టణ ప్రాంతాల్లో-

పట్టణ ప్రాంతాల్లో బట్టలు ఉతికేవాళ్లు/చౌకీదార్లు, చినిగిన బట్టలు ఏరుకునేవారు, మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు, రిపెయిర్ వర్కర్లు, ఇళ్లలో పనిచేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు, తోటమాలీలు, వీధులు ఊడ్చేవాళ్లు, చేతి వృత్తులు చేసుకునేవాళ్లు, హస్తకళల కార్మికులు, కుట్టుపనివాళ్లు, చెప్పులు కుట్టేవాళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, ప్లంబర్లు, మేస్త్రీలు, భవన నిర్మాణ కూలీలు, పోర్టర్లు, వెల్డర్లు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, వాహనాలు నడిపే డ్రైవర్లు, కండక్టర్లు, హెల్పర్లు, రిక్షా తొక్కేవారు, చిన్న సంస్థల్లో సహాయకులుగా పనిచేసేవారు, డెలివరీ బాయ్స్, షాప్ కీపర్లు, వెయిటర్లు, అందరూ ఈ పథకం నుంచి లబ్ది పొందవచ్చు.

ఈ పథకం కింద అందించే ఖర్చులు

ఆసుపత్రిలో చేర్చినపుడు అయిన ఖర్చుతోపాటు వైద్యపరీక్షలు, చికిత్స, కన్సల్టేషన్, ప్రీ-హాస్పిటలైజేషన్, నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, మందులు, ఇతరత్రా ఖర్చులు అందిస్తారు.

డయాగ్నస్టిక్స్, లేబొరేటరీ సర్వీసులు, వసతి, అవసరమైన చోట మెడికల్ ఇంప్లాంట్ సేవలు, ఆహార సేవలు, చికిత్స సమయంలో తలెత్తే క్లిష్ట సమస్యలు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత 15 రోజుల పాటు వైద్య పరమైన ఖర్చులు కూడా చెల్లిస్తారు.

కోవిడ్-19 చికిత్సను కూడా ఈ పథకం కింద అందిస్తారు.

పీఎంజేఏవై పథకానికి కావలసిన ధృవపత్రాలు: గుర్తింపుకార్డు, వయసు ధృవపత్రం (ఆధార్ కార్డు/పాన్ కార్డు), మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, ఇంటి అడ్రస్, కుల ధృవపత్రం, ఆదాయ ధృవపత్రం, కుటుంబ స్థితిగతులను తెలిపే ధృవపత్రం.

పీఎంజేఏవై ఆసుపత్రుల జాబితా తెలుసుకోవాలంటే పీఎంజేఏవై అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో హాస్పిటల్ సెక్షన్లో మీ రాష్ట్రం, జిల్లాలపై క్లిక్ చేయాలి. ఏ ఆస్పత్రిలో చేరాలనుకుంటున్నారో (ప్రభుత్వ, ప్రైవేట్-ఫర్-ప్రాఫిట్/ప్రైవేట్-అండ్ నాన్‌ ప్రాఫిట్) ఎంపిక చేసుకోవాలి. మెడికల్ స్పెషాలిటీని ఎంపిక చేసుకోవాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి.

పీఎంజేఏవైకి అర్హత పొందాలంటే?

పీఎంజేఏవై స్కీమ్ వెబ్‌సైట్ https://pmjay.gov.in/ ఓపెన్ చేసి 'యామ్ ఐ ఎలిజిబిల్' క్లిక్ చేయాలి.

అందులో మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అక్కడున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత 'జనరేట్ ఓటీపీ' క్లిక్ చేయాలి.

తర్వాత లబ్దిదారుడు తన రాష్ట్రం, జిల్లాలను సెలెక్ట్ చేయాలి. తర్వాత పేరు/హెచ్‌హెచ్‌డీ నంబరు/రేషన్ కార్డు నంబరు/మొబైల్ నంబరును సెర్చ్ చేయాలి.

సెర్చ్‌లో వచ్చిన ఫలితాల ప్రాతిపదికగా పీఎంజేఏవై కింద మీ కుటుంబానికి అర్హత ఉందో లేదో తెలుస్తుంది.

పీఎంజేఏవైకి అర్హత పొందారో లేదో తెలుసుకోవడానికి జాబితాలోని ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ (ఈహెచ్‌సీపీ)ని సంప్రదించవచ్చు. లేదా ఆయుష్మాన్ భారత్ యోజన కాల్ సెంటర్ నంబరు 14555 లేదా 1800-111-565కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అర్హులైనవారు తర్వాత ఈ-కార్డు పొందడానికి ప్రయత్నించాలి.

ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం రిజిస్టర్ చేసుకునేందుకు లేదా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో పది నిమిషాల్లోపే రిజిస్టర్ చేసుకుని.. ఈ కార్డును పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ దరఖాస్తు, ఇ-కార్డు ప్రక్రియ

  పీఎంజేఏవైకి అర్హులు అని నిర్ధరణ అయిన తర్వాత ఈ-కార్డుకు ప్రయత్నించవచ్చు. కార్డు జారీ చేసే ముందు పీఎంజేఏవై దగ్గర మీ ఆధార్ కార్డు లేదా డ్రైవి...