Monday, August 28, 2023

ఆయుష్మాన్ భారత్ దరఖాస్తు, ఇ-కార్డు ప్రక్రియ

 పీఎంజేఏవైకి అర్హులు అని నిర్ధరణ అయిన తర్వాత ఈ-కార్డుకు ప్రయత్నించవచ్చు. కార్డు జారీ చేసే ముందు పీఎంజేఏవై దగ్గర మీ ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు పరిశీలిస్తారు.

కుటుంబసభ్యుల గుర్తింపు నిర్ధరణ పత్రాలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సభ్యుల జాబితా పత్రాలు కూడా చూపాలి.

అలాగే పీఎం లెటర్, ఆర్‌ఎస్‌బీవై కార్డులు కూడా చూపాలి. వీటిని పరిశీలించిన తర్వాత ఈ-కార్డు ప్రింట్ ఇస్తారు.

ఆ కార్డును ప్రత్యేకంగా ఏబీ-పీఎంజేఏవై ఐడీతో ఇస్తారు. దీన్ని భవిష్యత్తులో ఏ సందర్భంలోనైనా ప్రూఫ్‌గా వాడవచ్చు.

ఈ పథకం కింద కుటుంబ సభ్యులందరినీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆడపిల్లలు, స్త్రీలు, వృద్ధులకు ముఖ్యంగా అరవై ఏళ్లు పైబడ్డవారికి ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఈ పథకం కింద అందించే ఖర్చులు

ఆసుపత్రిలో చేర్చినపుడు అయిన ఖర్చుతోపాటు వైద్యపరీక్షలు, చికిత్స, కన్సల్టేషన్, ప్రీ-హాస్పిటలైజేషన్, నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, మందులు, ఇతరత్రా ఖర్చులు అందిస్తారు.

డయాగ్నస్టిక్స్, లేబొరేటరీ సర్వీసులు, వసతి, అవసరమైన చోట మెడికల్ ఇంప్లాంట్ సేవలు, ఆహార సేవలు, చికిత్స సమయంలో తలెత్తే క్లిష్ట సమస్యలు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత 15 రోజుల పాటు వైద్య పరమైన ఖర్చులు కూడా చెల్లిస్తారు.

కోవిడ్-19 చికిత్సను కూడా ఈ పథకం కింద అందిస్తారు.

పీఎంజేఏవై పథకానికి కావలసిన ధృవపత్రాలు: గుర్తింపుకార్డు, వయసు ధృవపత్రం (ఆధార్ కార్డు/పాన్ కార్డు), మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, ఇంటి అడ్రస్, కుల ధృవపత్రం, ఆదాయ ధృవపత్రం, కుటుంబ స్థితిగతులను తెలిపే ధృవపత్రం.

పీఎంజేఏవై ఆసుపత్రుల జాబితా తెలుసుకోవాలంటే పీఎంజేఏవై అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో హాస్పిటల్ సెక్షన్లో మీ రాష్ట్రం, జిల్లాలపై క్లిక్ చేయాలి.

ఏ ఆస్పత్రిలో చేరాలనుకుంటున్నారో (ప్రభుత్వ, ప్రైవేట్-ఫర్-ప్రాఫిట్/ప్రైవేట్-అండ్ నాన్‌ ప్రాఫిట్) ఎంపిక చేసుకోవాలి. మెడికల్ స్పెషాలిటీని ఎంపిక చేసుకోవాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి.

No comments:

Post a Comment

ఆయుష్మాన్ భారత్ దరఖాస్తు, ఇ-కార్డు ప్రక్రియ

  పీఎంజేఏవైకి అర్హులు అని నిర్ధరణ అయిన తర్వాత ఈ-కార్డుకు ప్రయత్నించవచ్చు. కార్డు జారీ చేసే ముందు పీఎంజేఏవై దగ్గర మీ ఆధార్ కార్డు లేదా డ్రైవి...